మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో రసాయన కర్మాగారం లింబానీ సాల్డ్ ఇండస్ట్రీస్ లో పేలుడు సంభవించింది. దీనిలో ఒకరు మరణించగా, మరో నలుగురు గాయపడ్డారని అధికారులు శుక్రవారం తెలిపారు. లోహం, ఆమ్లం కలిపే సమయంలో ఈ పేలుడు జరిగిందని విపత్తు నిర్వహణ సెల్ చీఫ్ వివేకానంద కదమ్ తెలిపారు. అగ్నిమాపక దళం, విపత్తు నిర్వహణ సిబ్బందితో సహా అత్యవసర బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చాయి. ఈ ఘటనలో ఒకరు అక్కడిక్కడే మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని అన్నారు. మరో ఇద్దరు కార్మికులు స్వల్పగాయాలయ్యాయని, వారి పరిస్థితి నిలకడగా ఉందని అన్నారు. ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించామని అన్నారు.
లింబానీ సాల్డ్ ఇండస్ట్రీస్ లో పేలుడు : ఒకరు మృతి, మరో నలుగురికి గాయాలు
September 19, 2025
0
Tags