టోల్ ప్లాజా వద్ద పేలిన లారీ టైరు : సురక్షితంగా బయటపడ్డ సిబ్బంది

Telugu Lo Computer
0


రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో టోల్ ప్లాజా వద్ద ఒక లారీ ఆగింది. ఉన్నట్టుండి దాని టైరు పేలింది. టోల్ బూత్ క్యాబిన్‌లో కూర్చొన్న సిబ్బందిపై విరిగిన విండో పడింది. అతడికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.  ఈ సంఘటన జరిగింది. శనివారం జైపూర్‌ జిల్లాలోని హింగోనియా టోల్ ప్లాజాలోని గేట్‌ 6 వద్ద ఒక లారీ ఆగింది. అయితే ఉన్నట్టుండి దాని టైరు పేలింది. లారీ టైరు పేలుడు ధాటికి టోల్‌ ప్లాజా క్యాబిన్‌కు ఉన్న విండో, అద్దాలు పగిలి లోపల కంప్యూటర్ వద్ద పని చేస్తున్న సిబ్బందిపై పడింది. దీంతో అతడు క్యాబిన్‌ నుంచి బయటకు పరుగుతీసి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఈ సంఘటనలో కంప్యూటర్ కూడా ధ్వంసమైంది.

Post a Comment

0Comments

Post a Comment (0)