విశాఖలో ఈస్ట్‌ఇండియా పెట్రోలియం కంపెనీపై పడిన పిడుగు

Telugu Lo Computer
0


విశాఖ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఈస్ట్‌ఇండియా పెట్రోలియం కంపెనీపై పిడుగు పడింది. కంపెనీలోని పెట్రోల్‌ ఫిల్టర్‌ ట్యాంక్‌పై పిడుగు పడటంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకొని మంటలు ఆర్పివేశారు. విశాఖలో అగ్నిప్రమాద ఘటనపై హోం మంత్రి అనిత స్పందించారు. అగ్నిమాపకశాఖ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)