రాంచీలో ఐసిస్ ఉగ్రవాదుల కోసం బాంబులు తయారు చేస్తున్న విద్యార్థి అరెస్టు !

Telugu Lo Computer
0


జార్ఖండ్ రాజధాని రాంచీలోని ఇస్లాంనగర్ ప్రాంతంలో తబారక్ లాడ్జ్ లో  ప్రభుత్వ ఉద్యోగాలకు, ఎస్ఎస్‌సీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నా అని చెప్పుకుంటున్న అషర్ డానిష్ అనే వ్యక్తి, ఐసిస్ ఉగ్రవాదుల కోసం బాంబులు తయారు చేస్తున్నాడు.   గత వారం ఢిల్లీ పోలీసుల మరో ఉగ్రవాది అఫ్తాబ్ ఖురేషిని అరెస్ట్ చేసి, విచారణ చేయగా డానిష్ గురించిన వివరాలు వెలుగులోకి వచ్చాయి. సమాచారం మేరకు, డానిష్, ఇతర వ్యక్తుల్ని అరెస్ట్ చేసేందుకు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. బీజేపీ నాయకుల్ని టార్గెట్ చేస్తున్నట్లు విచారణలో తేలింది. డానిష్ గది నుంచి గన్‌పౌడర్, బాంబులు, పొటాషియం నైట్రేట్, మరికొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకునున్నారు. ఈ గదిలో బాంబుల్ని తయారు చేసి, సువర్ణ రేఖ నదిలో వీటిని పేల్చి పరీక్షించినట్లు తేలింది. గదిలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ గది కేవలం బాంబుల తయారీ కర్మాగారం మాత్రమే కాకుండా, టెర్రరిస్టులు తమ రిక్రూట్‌మెంట్‌ల కోసం వాడుకుంటున్నట్లు తేలింది. రిక్రూట్ మెంట్ల కోసం సిగ్నల్ మెసేజింగ్ యాప్ వాడుకుంటున్నట్లు తేలింది. బాంబుల తయారీకి కావాల్సిన నిధుల్ని సేకరించడానికి దీనిని వాడుకున్నారు. అమెజాన్ నుంచి కత్తులు, రసాయనాలు ఆర్డర్ చేసినట్లు తేలింది. డానిష్‌కు పాకిస్తాన్ హ్యండ్లర్ పెంటాఎరిథ్రిటోల్ టెట్రానైట్రేట్ బాంబులు ఎలా తయారు చేయాలో నేర్పించాడు. ఈ ఉగ్రవాద మాడ్యూల్‌లో సుఫియాన్ ఖాన్, మొహమ్మద్ హుజైఫ్ యమన్, కమ్రాన్ ఖుషేరీ సభ్యులుగా ఉన్నారు. వీరు మతపరమైన ప్రదేశాలపై దాడి చేయడానికి ప్రణాళికలు ఉన్నట్లు తెలుస్తోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)