బంగారంతో రూపొందించిన 'ఓం సాయి రామ్' అనే అక్షరాలను శిర్డీ సాయిబాబా ఆలయానికి విరాళంగా ఇచ్చిన భక్తుడు

Telugu Lo Computer
0


దుబాయ్‌కు చెందిన భక్తుడు రూ.1.58 కోట్ల విలువైన కానుకలను శిర్డీ సాయిబాబా ఆలయానికి సమర్పించాడు. 1 కిలో 623 గ్రాముల బంగారంతో రూపొందించిన 'ఓం సాయి రామ్' అనే అక్షరాలను గురువారం శిర్డీ ఆలయానికి విరాళంగా ఇచ్చాడు. తన వివరాలు బహిర్గతం చేయొద్దని సాయి బాబా సంస్థాన్‌ను కోరినట్లు తెలుస్తోంది. దుబాయ్‌కు చెందిన భక్తుడి కుటుంబం ప్రతినెలా శిర్డీ సాయినాథుడిని దర్శనం చేసుకొని.. రూ.లక్ష విరాళంగా ఇస్తారని దేవాలయ అధికారులు పేర్కొన్నారు. గురువారం మరోసారి శిర్డీని సందర్శించిన భక్తుడు కోటిన్నర రూపాయల విలువైన బంగారు అక్షరాలను బహూకరించినట్లు తెలిపారు. ఆలయంలోని రెండు ప్రధాన ద్వారాలకు వీటిని అమర్చినట్లు తెలిపారు. శిర్డీ సాయినాథుడికి అనేక మంది భక్తులు కానుకలు సమర్పిస్తుంటారని సాయి బాబా సంస్థాన్ సీఈఓ గోరక్ష్ గడిల్కర్ తెలిపారు. 2008లో ఆదినారాయణ రెడ్డి అనే భక్తుడు బాబాకు దాదాపు 100 కిలోల బంగారపు సింహాసనాన్ని విరాళంగా ఇచ్చారని, దాని తర్వాత ప్రస్తుతం ఇచ్చిన బంగారు అక్షరాలే విలువైన విరాళమని పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)