తెలంగాణ మాజీ మంత్రి సత్యవతి రాథోడ మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గుండ్రాతిమడుగు రైతు వేదిక వద్ద యూరియా బస్తాల కోసం క్యూలో నిలబడి వేచి చూశారు. తన సొంత గ్రామం పెద్ద తాండలో తనకున్న ఐదున్నర ఎకరాల భూమికి యూరియా కోసం రాగా కేవలం ఒక్క బస్తా మాత్రమే ఇచ్చారని అసహనం వ్యక్తం చేశారు. మిగిలిన మహళలు, రైతులతో కలిసి సత్యవతి రాథోడ్ యూరియా కేంద్రం వద్ద వేచి చూసారు. అక్కడ యూరియా కోసం రైతుల బాధలను అడిగి తెలుసుకున్నారు. తమ ప్రభుత్వ హయాంలో యూరియా కొరత ఏనాడు రాలేదని, విద్యుత్, నీరు అంశాల్లోనూ సమస్యలు రాకుండా రైతులకు అన్ని రకాలుగా అండగా నిలిచామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు యూరియా కోసం రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి పట్టటం లేదని సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
యూరియా కోసం క్యూ లైన్ లో నిల్చున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
September 14, 2025
0
Tags