అసోంలోని గువహటి, అర్జున్ భోగేశ్వర్ బారువా స్పోర్ట్స్ కాంప్లెక్స్ జనసంద్రమైంది. ప్రముఖ అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్‌ను (52) కడసారి చూసేందుకు లక్షల మంది అభిమానులు తరలివచ్చారు. భారీగా తరలివచ్చిన అభిమానులు ఎండ, వానను సైతం లెక్క చేయకుండా జుబీన్ చిత్రాలు, కటౌట్ పట్టుకుని, ఆయన పాడిన పాటలు పాడుతూ నివాళులర్పించారు. మరోవైపు జుబీన్ గార్గ్ అంతిమయాత్ర రికార్డు సృష్టించింది. ప్రముఖుల అంతిమయాత్రలో ప్రజలు, అభిమానులు పాల్గొనడం సర్వసాధారణం. కానీ, ఈ స్థాయిలో అభిమానులు రావడం చాలా అరుదు. మైఖేల్ జాక్సన్, పోప్ ఫ్రాన్సిస్, క్వీన్ ఎలిజెబెత్-2ల అంతిమయాత్రల తర్వాత అత్యధికమంది పాల్గొన్న ఉత్తర క్రియగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కింది. జుబీన్ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో మంగళవారం ఉదయం పూర్తి చేశారు. గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య సహా పలువురు ప్రముఖులు జుబీన్ భౌతికకాయానికి నివాళుర్పించారు. సెప్టెంబరు 19న సింగపూర్‌లో స్కూబా డైవింగ్ చేస్తుండగా జుబీన్ మరణించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వీటిని నార్త్ ఈస్ట్ ఫెస్టివల్ నిర్వాహకులు ఖండించారు. విహార నౌకలో ప్రమాదానికి గురైన జుబీన్‌ను సింగపూర్ హాస్పిటల్‌కు తరలించారని, అక్కడే ఆయన మృతి చెందినట్లు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం భౌతికకాయాన్ని అస్సాంకు తీసుకొచ్చారు. అనంతరం గువాహటిలోని అర్జున్ భోగేశ్వర్ బారువా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో అభిమానుల సందర్శనార్థం ఉంచి, అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు.
జనసంద్రమైన గువహటి అర్జున్ భోగేశ్వర్ బారువా స్పోర్ట్స్ కాంప్లెక్స్ !
September 23, 2025
0
Tags