మావోయిస్టు కీలక నేత సుజాతక్క తెలంగాణ డీజీపీ జితేందర్ ఎదుట ఇవాళ లొంగిపోయారు. సుజాతక్క మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్‌గా ఉన్నారు. సుజాతక్క అలియాస్ పోతుల కల్పన గద్వాలకు చెందిన వారు. 1984లో కిషన్‌జీని వివాహం చేసుకున్నారు. ఆమె మొత్తం 106 కేసుల్లో నిందితురాలిగా ఉన్నారు. 43 ఏళ్లుగా ఆమె అజ్ఞాతంలో ఉన్నారు. సుజాతక్క లొంగుబాటు అనంతరం డీజీపీ జితేందర్ మీడియాతో మాట్లాడారు.
మావోయిస్టు కీలక నేత సుజాతక్క లొంగుబాటు
September 13, 2025
0
Tags