మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, ఐపీఎస్ అధికారిణి అంజనా కృష్ణ మధ్య జరిగిన వాగ్వాదం నెట్టింట వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా అజిత్ పవార్ స్పందిస్తూ చట్టపరమైన విషయాల్లో జోక్యం చేసుకునే ఉద్దేశం తనకు లేదని తెలిపారు. కేవలం అక్కడి పరిస్థితిని చక్కదిద్దేందుకే ఆమెకు ఫోన్ చేసినట్లు తెలిపారు. ఇసుక అక్రమ తవ్వకాలపై చర్యలు చేపట్టిన ఐపీఎస్ అధికారిణి అంజనా కృష్ణతో అజిత్ పవార్ ఫోన్‌లో మాట్లాడారు. ఆ చర్యలను వెంటనే ఆపాలని ఆమెను ఆదేశించారు. 'నీకు ఎంత ధైర్యం? ఉపముఖ్యమంత్రి ఫోన్ చేస్తే నమ్మవా? నన్నే వీడియో కాల్ చేయమంటావా?' అని ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో ఆయనపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ వివాదంపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ''సోలాపుర్‌లో పోలీసు అధికారులతో నా సంభాషణకు సంబంధించిన వీడియో వైరల్ అవడం నా దృష్టికి వచ్చింది. చట్టపరమైన విషయాల్లో జోక్యం చేసుకోవడం నా ఉద్దేశం కాదు. కేవలం అక్కడ పరిస్థితి మరింత తీవ్రంగా మారకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఫోన్‌లో మాట్లాడా. పోలీసు విభాగం, ముఖ్యంగా మహిళా అధికారులంటే నాకు చాలా గౌరవం ఉంది. చట్టానికి కట్టుబడి ఉంటా. ఇసుక, మైనింగ్ అక్రమ కార్యకలాపాలకు నేను ఎప్పటికీ వ్యతిరేకమే'' అని పేర్కొన్నారు.
పరిస్థితిని చక్కదిద్దేందుకే ఐపీఎస్ అధికారిణికి ఫోన్ చేశా : అజిత్ పవార్
September 05, 2025
0
Tags