రక్షణ శాఖ భూములు తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించండి !

Telugu Lo Computer
0


ఢిల్లీ పర్యటనలో వున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈరోజు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం 98.20 ఎకరాల రక్షణశాఖ భూములను తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాలని కోరారు. మూసీ, ఈసీ నదుల సంగమం సమీపంలో 'గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ' నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. జాతీయ సమైక్యత, గాంధేయ విలువలకు సంకేతంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిలుస్తుందని పేర్కొన్నారు. అణచివేత, దమనకాండపై చాకలి ఐలమ్మ ధిక్కార పతాకాన్ని ఎగురవేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. తెలంగాణ గడ్డపై దొరల అహంకారానికి, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా 80 ఏళ్ల క్రితమే జంగ్ సైరన్ ఊదిన యోధురాలు అని తెలిపారు. సమ్మక్క, సారలమ్మ, చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించినట్లు గుర్తుచేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)