ప్రారంభమైన తొలి జాతీయ మహిళా సాధికారత సదస్సు

Telugu Lo Computer
0


తొలి జాతీయ మహిళా సాధికారత సదస్సు తిరుపతిలో ప్రారంభమైంది. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఆధ్వర్యంలో 'వికసిత్‌ భారత్‌కు మహిళల నాయకత్వం' అనే నినాదంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ముఖ్యఅతిథిగా ఏపీ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ పాల్గొన్నారు. చట్టసభల్లో మహిళా ప్రజాప్రతినిధులకు ఎదురవుతున్న ఇబ్బందులు, సవాళ్లను అధిగమించడంలో మహిళా సాధికారత పాత్రపై సదస్సులో చర్చించనున్నారు. ఈ సదస్సుకు శాసనసభ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు, మంత్రి పయ్యావుల కేశవ్‌, పార్లమెంట్‌ కమిటీ (మహిళా సాధికారత) ఛైర్‌పర్సన్‌ దగ్గుబాటి పురందేశ్వరితో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూటమి నేతలు హాజరయ్యారు.

Post a Comment

0Comments

Post a Comment (0)