అరబిందో ఫార్మా వ్యర్థ పదార్థాలను రైతుల పొలాల్లోకి వదులుతోంది : కంపెనీని తగలబెడతామని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి

Telugu Lo Computer
0


తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అరబిందో ఫార్మా కంపెనీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పోలేపల్లి సెజ్ ప్రాంతంలోని అరబిందో కంపెనీ వ్యవహారంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అరబిందో కంపెనీని తగలబెడతానని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అరబిందో ఫార్మా కంపెనీ వ్యర్ధ పదార్థాలను రైతుల పొలాల్లోకి వదులుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఎన్నిసార్లు వినతిపత్రం ఇచ్చినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు ఎమ్మెల్యే. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు అరబిందో కంపెనీతో కుమ్మక్కుయ్యారని ఆరోపించిన ఎమ్మెల్యే, రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అరబిందో కంపెనీ వ్యర్థాలను రైతుల పొలాల్లోకి వదలడం వల్ల పంటలు నాశనమవుతున్నాయని, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)