తిరుమలపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు !

Telugu Lo Computer
0


క్తుల మనోభావాలను దెబ్బతీసేలా తిరుమలపై తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని ఏపీ ప్రభుత్వం ఆందోళన వ్యక్తంచేసింది. అలిపిరి నడక మార్గంలో చికెన్ బిర్యానీ హోటల్స్‌కు సంబంధించిన ప్రకటనలు ఉంచినట్లు సామాజిక మాధ్యమాల్లో ఓ ఫేక్‌ వీడియోను ప్రచారం చేస్తుండటంపై మండిపడింది. చంద్రగిరికి వెళ్లే రోడ్డులోని బారికేడ్‌పై ఉన్న హోటల్‌ ప్రకటనకు స్వామివారి పవిత్ర నామం ఆడియోను జత చేసి కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసినట్లు గుర్తించినట్లు ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్‌ విభాగం తెలిపింది. పవిత్రమైన తిరుమల క్షేత్రంపై భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసేలా జరుగుతున్న ఇలాంటి అసత్య ప్రచారాలను గ్రహించాలని తెలుపుతూ వైకాపా 'ఎక్స్‌'లో పోస్టు చేసిన నకిలీ వీడియో స్క్రీన్‌షాట్‌ను జత చేసింది. మరోవైపు, ఇదే అంశంపై అంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థానం సైతం స్పందించింది. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోన్న ఆ వీడియో నకిలీదని స్పష్టం చేసింది. ఆ బారికేడ్‌ ఉన్న ప్రాంతం తిరుమల పరిధిలోకి రాదని.. ఆ రహదారి చంద్రగిరికి వెళ్లేదని తెలిపింది. ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)