తగ్గిన రైల్‌ నీర్‌ ధర !

Telugu Lo Computer
0


వాటర్‌ బాటిల్‌ ధరను సెప్టెంబర్‌ 22 నుంచి తగ్గిస్తున్నట్లు భారతీయ రైల్వేస్‌ ప్రకటించింది. రైల్వే మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసిన ప్రకటనలో డైరెక్టరేట్ అంగీకారంతో తాగునీటి బాటిళ్ల గరిష్ట చిల్లర ధర తగ్గించబడింది. ఈ ధరలు రైల్వే స్టేషన్లు, రైళ్లలో అమ్మకానికి వర్తిస్తాయి. ప్రయాణికులకు తక్కువ ధరలో నాణ్యమైన తాగునీరు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఇంతకు ముందు అది 15 రూపాయలు ఉండగా, ఇప్పుడు దానిని 14 రూపాయలుగా మార్చింది. అలాగే అర లీటర్‌ బాటిల్‌ ధరను రూ.10 నుంచి రూ.9కి తగ్గించినట్లు తెలిపింది. రైల్‌ నీర్‌ అనేది ప్రభుత్వ నియంత్రణలో ఐఆర్‌సీటీసీ ద్వారా సరఫరా అవుతోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)