బాలీవుడ్‌ నటుడు ఆశిష్‌ వారంగ్‌ కన్నుమూత

Telugu Lo Computer
0


బాలీవుడ్‌ నటుడు ఆశిష్‌ వారంగ్‌ (55) శుక్రవారం మరణించారు. ఆయన మరణ వార్త తెలిసి సన్నిహితులు, అభిమానులు షాకవుతున్నారు. దర్శకనిర్మాత అరిణ్‌ పాల్‌ సోషల్‌ మీడియా వేదికగా నటుడి మృతి పట్ల సంతాపం ప్రకటించాడు. ఆశిష్‌ చనిపోయారని తెలిసి షాకయ్యాను. ఆయనతో కలిసి పనిచేసే అదృష్టం నాకు లభించినందుకు గర్వంగా ఉంది. ఆయన మృదుస్వభావి, కళపట్ల అంకితభావంతో మెదిలేవాడు. ప్రతి సీన్‌లోనూ ప్రాణం పెట్టి యాక్ట్‌ చేసేవాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టాడు. కాగా ఆశిష్‌.. అక్షయ్‌కుమార్‌ 'సూర్యవంశీ', అజయ్‌ దేవ్‌గణ్‌ 'దృశ్యం' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. రాణి ముఖర్జీ 'మర్దానీ' సినిమాలోనూ తన నటనతో ఆకట్టుకున్నాడు. హిందీలోనే కాకుండా మరాఠీ చిత్రాల్లోనూ యాక్ట్‌ చేశాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)