తెలంగాణ నూతన డీజీపీగా శివధర్రెడ్డి నియమితులయ్యారు. 1994 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన శివధర్రెడ్డి ప్రస్తుతం ఇంటెలిజెన్స్ ఛీఫ్ గా ఉన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ఆయన అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకున్నారు. హైదరాబాద్ లో జన్మించిన శివధర్ రెడ్డి సొంతూరు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తూలేకలాన్ (పెద్దతుండ్ల). ప్రైమరీ స్కూల్ నుంచి ఉన్నత విద్య వరకు శివధర్ రెడ్డి హైదరాబాద్ లో చదువుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్ బీ పూర్తి చేసి కొంతకాలం అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేశారు. ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ క్లియర్ చేసి 1994 లో ఇండియన్ పోలీస్ సర్వీస్ లోకి ప్రవేశించారు. అనంతరం విశాఖపట్నంలోని అనకాపల్లి, నర్సీపట్నం, చింతపల్లిలో ఏఎస్పీ గా శివధర్ రెడ్డి పని చేశారు. గ్రేహౌండ్స్ స్క్వాడ్రన్ కమాండర్ గా, బెల్లంపల్లి, ఆదిలాబాద్, నల్గొండ, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు జిల్లాల ఎస్పీగా సేవలందించారు.
తెలంగాణ కొత్త డీజీపీగా శివధర్ రెడ్డి
September 27, 2025
0
Tags