తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలోని కొలనులో వినాయక విగ్రహాన్ని నిమజ్జనం కోసం క్రేన్ తో విగ్రహాన్ని ఎత్తి దింపుతుండగా ఒక్కసారిగా క్రేన్ వైర్ తెగిపోయింది. దీంతో భారీ వినాయక విగ్రహం దాని కింద ఉన్న భక్తుల మీదకు పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడిన ఇద్దరు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
వినాయక నిమజ్జనంలో అపశ్రుతి : క్రేన్ తెగిపడి ఇద్దరికి తీవ్ర గాయాలు
September 06, 2025
0
Tags