బంగారం ధర 24 క్యారెట్లు 10 గ్రాములకు గాను 1.05 లక్షల రూపాయలకు చేరుకుంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 96 వేల రూపాయలకుపైనే ఉంది. దీంతో బంగారం కొనుగోలు చేయాలంటే సామాన్యులకు భారంగా మారింది. 22 క్యారెట్ల బంగారంతో బంగారు ఆభరణాలను తయారు చేస్తారు. ఇందులో 91.6% వరకు బంగారం ఉంటుంది. దీనినే 916 కేడియం బంగారం అని కూడా పిలుస్తారు. ఇందులో కొద్దిగా ఇతర లోహాలను కూడా కలుపుతారు. మేలిమి బంగారంతో బంగారు ఆభరణాలు తయారు చేయడం కుదరదు. ఎందుకంటే బంగారం స్వభావం కాస్త మెత్తగా ఉంటుంది. వాటిపై డిజైన్లు నగిషీలు చెప్పాలంటే కాస్త దృఢత్వం అవసరం ఉంటుంది. అందుకే అందులో రాగి సహా ఇతర లోహాలు కలుపుతారు. బంగారు ఆభరణాలను తయారు చేయడానికి 18క్యారట్ల బంగారం కూడా ఉపయోగిస్తారు. ఇందులో 75% మేలిమి బంగారం, మరో 25% మిగతా లోహాలు ఉంటాయి. దీని ధర కూడా 10 గ్రాములకు గానూ సుమారు 75 వేల రూపాయల వరకు ఉంటుంది. ఇందులో బంగారం శాతం తగ్గిన నేపథ్యంలో ఇది కాస్త గట్టిగా ఉంటుంది. బంగారు విగ్రహాలను, వాచీలను ఇతర బరువైన ఆభరణాలను తయారు చేయడానికి ఈ 18 క్యారెట్ల బంగారాన్ని ఉపయోగిస్తారు. 14 క్యారెట్ల బంగారం కూడా మార్కెట్లో అందుబాటులో ఉంది. వీటిని దీని ధర తక్కువగా ఉన్నప్పటికీ దీనిని జ్యువెలరీ తయారీకి ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇందులో 58.3% బంగారం ఉంటుంది. అయితే ఇటీవల 9 క్యారెట్ల బంగారం కూడా విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో మేలిమి బంగారం 37.5% మాత్రమే ఉంటుంది. మిగతా 62.5% ఇతర లోహాలు కలిపి ఉంటుంది. ఇప్పుడు ఈ నగలకు బీఐఎస్ హాల్ మార్క్ ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం అంగీకరించింది. వీటిని ప్రస్తుతం మార్కెట్లో విక్రయిస్తున్నారు. దీని ధర 10 గ్రాములకు గాను రూ. 36, 660 వరకు ఉంటుంది. ఈ ధరలు ప్రాంతాలను బట్టి కాస్తా ఎక్కువ తక్కువ ఉండవచ్చు. ప్రభుత్వం ఇటీవల 9 క్యారెట్ల బంగారు ఆభరణాలకు హాల్‌మార్కింగ్‌ను నోటిఫై చేసిన నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ చర్యను ఆభరణాల పరిశ్రమ స్వాగతించింది. ఇప్పటివరకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ 24K, 23K, 22K, 20K, 18K, 14K బంగారానికి హాల్‌మార్కింగ్ నిబంధనలను కలిగి ఉంది. కొత్త 9K హాల్‌మార్కింగ్ ప్రమాణం తేలికైన బంగారు ఆభరణాలకు డిమాండ్‌ను పెంచుతుందని భావిస్తున్నారు. 9K బంగారానికి హాల్‌మార్కింగ్ ప్రవేశపెట్టడం పండుగ, వివాహ సీజన్‌లలో మంచి డిమాండ్ ఏర్పడవచ్చు.
9K బంగారం ధర తులం రూ.36 వేలు !
September 01, 2025
0
Tags