ఐఆర్‌సీటీసీ సాయి సన్నిధి పేరిట హైదరాబాద్ నుంచి రూ.5వేలకే శిర్డీ యాత్ర

Telugu Lo Computer
0


హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ సాయి సన్నిధి పేరిట యాత్రను తీసుకొచ్చింది. సెప్టెంబర్‌ 24 నుంచి నవంబర్‌ 12 వరకు టికెట్లు అందుబాటులో వుంటాయి. ప్రతి బుధవారం కాచిగూడ నుంచి రైలు ప్రారంభమవుతుంది. బాసర, కామారెడ్డి, మేడ్చల్‌, మల్కాజ్‌గిరి, నిజామాబాద్‌ స్టేషన్లలో ఆగుతుంది. కంఫర్ట్‌, స్టాండర్డ్‌ పేరిట రెండు రకాల ప్యాకేజీలు ఉంటాయి. కంఫర్ట్‌ ఎంచుకున్న వారికి థర్డ్‌ ఏసీలో ప్రయాణం ఉంటుంది. స్టాండర్డ్‌ ఎంచుకున్న వారికి స్లీపర్‌ క్లాస్‌లో బెర్త్‌ కేటాయిస్తారు. కాచిగూడ రైల్వేస్టేషన్‌ నుంచి బుధవారం సాయంత్రం 6.40 గంటలకు 17064 రైలు (అజంతా ఎక్స్‌ప్రెస్‌) ప్రారంభమవుతుంది. రాత్రంతా ప్రయాణం ఉంటుంది. రెండో రోజు ఉదయం 7.10 గంటలకు నాగర్‌సోల్‌ రైల్వేస్టేషన్‌ చేరుకుంటారు. అక్కడి నుంచి ఐఆర్‌సీటీసీ సిబ్బంది శిర్డీలో ముందుగానే ఏర్పాటు చేసిన హోటల్‌కు తీసుకెళ్తారు. అక్కడి నుంచి శిర్డీ ఆలయ సందర్శనకు వెళ్లాల్సి ఉంటుంది. దర్శనం టికెట్‌ సొంతంగా కొనుగోలు చేయాలి. అది ప్యాకేజీలో భాగం కాదు. దర్శనం తర్వాత సాయంత్రం 5 గంటలకు చెక్‌ అవుట్‌ చేయాల్సి ఉంటుంది. తిరిగి ప్రయాణమయ్యేందుకు నాగర్‌సోల్‌ స్టేషన్‌కు చేరుకుంటారు. రాత్రి 8.30 గంటలకు రైలు ప్రారంభమవుతుంది. రాత్రంతా ప్రయాణం ఉంటుంది. మూడో రోజు ఉదయం 9.45 గంటలకు కాచిగూడ రైల్వేస్టేషన్ చేరుకోవడంతో యాత్ర పూర్తవుతుంది. కంఫర్ట్‌లో (3ఏసీ) ఒక్కో ప్రయాణికుడు సింగిల్‌ షేరింగ్‌ రూమ్‌కు రూ.7,890, డబుల్ షేరింగ్‌ అయితే రూ.6,660 చెల్లించాల్సి ఉంటుంది. ట్రిపుల్‌ షేరింగ్‌కు రూ.6,640 చెల్లించాల్సి ఉంటుంది. 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌కు రూ.5,730, విత్‌అవుట్‌ బెడ్‌కు రూ.5,420 చెల్లించాల్సి ఉంటుంది. స్టాండర్డ్‌లో ఒక్కో ప్రయాణికుడు సింగిల్‌ షేరింగ్‌ రూమ్‌కు రూ.6,220, డబుల్ షేరింగ్‌ అయితే రూ.4,980 చెల్లించాల్సి ఉంటుంది. ట్రిపుల్‌ షేరింగ్‌కి రూ.4,960 చెల్లించాలి. 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌కు రూ.4,060, విత్‌ అవుట్‌ బెడ్‌కు రూ.3,750 చెల్లించాల్సి ఉంటుంది. ఎంచుకున్న ప్యాకేజీని బట్టి రైలులో 3 ఏసీ, స్లీపర్ క్లాస్ ప్రయాణం, ప్యాకేజీని బట్టి ప్రయాణానికి ఏసీ వాహనం, శిర్డీలో ఉండడానికి వసతి, ఉదయం అల్పాహారం ఉచితం, యాత్రికులకు ట్రావెల్ ఇన్సూరెన్స్, టోల్, పార్కింగ్ ఛార్జీలు వంటివి ప్యాకేజీలో భాగమే, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం వంటివన్నీ యాత్రికులే చూసుకోవాలి.

Post a Comment

0Comments

Post a Comment (0)