అంతర్వేదిలో 500 మీటర్లు వెనక్కి వెళ్లిన సముద్రం

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది తీరంలో సముద్రం ఏకంగా 500 మీటర్లు మేర వెనక్కు వెళ్లింది.  సముద్రం ఎంత మేరకు వెనక్కు వెళితే అంత ప్రమాదమని, అంతేస్థాయిలో ముందుకు రాకాసి అలలు విరుచుకుపడతాయని స్థానికంగా ప్రచారం జరుగుతుండడంతో ఈ నేపథ్యంలోనే అంతర్వేది తీరప్రాంతంలో సునామీకు సంబందించిన భయం వెల్లువెత్తుతోంది. రెండు రోజులుగా ఇలాగే ఉండిపోవడం తీరం నుంచి చూస్తే ఎక్కడో అలలు తీవ్రత ఉన్నట్లు కనిపిస్తుండడంతో ఏమయ్యిందో తెలియక తెగ కలవరానికి గురవుతున్నారు. కానీ స్థానిక మత్స్యకారులు యధాతధంగానే తమ చేపలవేటను సాగిస్తుండగా వారు దీనిపై ఆందోళన అనవసరమని కొట్టి పారేస్తున్నారు. అంతర్వేదిలో సముద్రం వెనక్కు వెళ్లడం కొత్తకాదు, గతంలో చాలా సార్లు ఇటువంటి పరిస్థితి కనిపించింది. గత ఏడాది కూడా సరిగ్గా ఇలానే సముద్రం 500 మీటర్లు మేర వెనక్కు వెళ్లి తీరప్రాంతం అంతా మైదానంలా మారింది. దీంతో అప్పుడు కూడా ఇది సునామీకి సంకేతం అన్నట్టుగా తెగ ప్రచారం జరిగింది. దీనికి తోడు సోషల్ మీడియాలో అయితే ఈవీడియోలు మరింత వైరల్ అయ్యాయి. అయితే రెండు రోజుల వ్యవధిలోనే సముద్రం సాధారణ స్థితిలోకి వచ్చింది. ఒకప్పుడు ఇప్పడున్నట్లే 500 మీటర్లు లోపలకు ఉండే సముద్రం కాలక్రమేణా తీరప్రాంతాన్ని కబలిస్తూ మరింత ముందుకు చొచ్చకువచ్చింది. దీంతో అంతర్వేది తీరప్రాంతంలోని పలు నిర్మాణాలు, సరుగుడు తోటలు కొబ్బరితోటలు సముద్రగర్భంలో కలిసిపోయాయి. తాజాగా సముద్రం 500 మీటర్లు మేర వెనక్కువెళ్లడంతో స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సునామీ సమయాల్లో కూడా ఇలానే సముద్రం వెనక్కు వెళ్లి మళ్లీ భారీ స్థాయిలో ముందుకు వస్తుందని, ఇది సునామీకు సంకేతమా అంటూ స్థానికంగా చర్చ జరుగుతోంది.. అయితే అధికారులు దీనిని కొట్టి పడేస్తున్నారు. సముద్రం అమావాస్య, పౌర్ణమిలకు ఇటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయని, ఇది సర్వ సాధారణమేనని స్థానికులు కొందరు చెబుతున్నారు.. 

Post a Comment

0Comments

Post a Comment (0)