ఆంధ్రప్రదేశ్ లో 50 చదరపు గజాల స్థలంలో ఇళ్ల నిర్మాణానికి రూ.1 ఫీజు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలు, మధ్యతరగతి వర్గాలకు ఇళ్ల నిర్మాణాన్ని సులభతరం చేయడానికి కీలక నిర్ణయం తీసుకుంది. 50 చదరపు గజాల వరకు స్థలంలో, గ్రౌండ్ ఫ్లోర్, గ్రౌండ్ ప్లస్ 1 అంతస్తుల నివాస భవనాల నిర్మాణానికి ప్రత్యేక అనుమతి అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఇంటి నిర్మాణ రిజిస్ట్రేషన్ ఫీజు కేవలం రూ.1 మాత్రమే వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారులకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇది రూ.3,000 వరకు ఉండేది. తాజా ఉత్తర్వులతో నగర పాలక సంస్థలు, నగర పంచాయతీల్లో పేద, మధ్యతరగతి వర్గాల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి రూ.1 మాత్రమే వసూల్ చేయనున్నారు. ఈ విధానం పేద, మధ్యతరగతి వర్గాలకు తక్కువ ఖర్చుతో ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించడానికి అవకాశాన్ని కల్పిస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)