దేశీయ మార్కెట్లో బీఎండబ్ల్యూ మోటోరాడ్ జీ 310 ఆర్ఆర్ లిమిటెడ్ ఎడిషన్ విడుదల చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ ధర రూ. 2.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). దీని ధర స్టాండర్డ్ జీ 310 ఆర్ఆర్ కంటే కూడా రూ. 18000 తక్కువ. దీనిని 310 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు. దేశంలో బీఎండబ్ల్యూ జీ 310 ఆర్ఆర్ 1000 యూనిట్లు అమ్ముడైన సందర్భంగా కంపెనీ జీ 310 ఆర్ఆర్ లిమిటెడ్ ఎడిషన్ లాంచ్ చేసింది. ఇది కాస్మొటిక్ అప్డేట్స్ పొందినప్పటికీ యాంత్రికంగా ఎలాంటి మార్పులు చేయలేదు. ఇది రెండు బేస్ కలర్ స్కీమ్‌లలో అందుబాటులో ఉంది. బీఎండబ్ల్యూ జీ 310 ఆర్ఆర్ లిమిటెడ్ ఎడిషన్ 312 సీసీ సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 9700 rpm వద్ద 34 bhp పవర్, 7700 rpm వద్ద 27.3 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. రైడ్-బై-వైర్ త్రాటిల్, రైడింగ్ మోడ్స్, డ్యూయల్-ఛానల్ ఏబీఎస్, ఫుల్ ఎల్ఈడీ లైటింగ్, కలర్ TFT డిస్ప్లే వంటివన్నీ ఈ బైకులో ఉన్నాయి.
జీ 310 ఆర్ఆర్ లిమిటెడ్ ఎడిషన్ విడుదల చేసిన బీఎండబ్ల్యూ మోటోరాడ్
September 26, 2025
0
Tags