హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ వాహనాల ధరలు సెప్టెంబర్ 22 నుంచి భారీగా తగ్గుతాయని వెల్లడించింది. ప్యాసింజర్ వాహనాలపై జీఎస్టీ తగ్గించడానికి భారత ప్రభుత్వం తీసుకున్న దూరదృష్టితో కూడిన చర్యను మేము హృదయపూర్వకంగా అభినందిస్తున్నామని హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ 'అన్సూ కిమ్' అన్నారు. ఈ సంస్కరణ ఆటోమోటివ్ పరిశ్రమకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. భారతదేశం వికసిత్ భారత్ మార్గంలో పాయిస్తున్నప్పుడు ఆటోమొబైల్ రంగం ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. హ్యుందాయ్ టక్సన్ కారు ధర గరిష్టంగా రూ. 2,40,303 వరకు తగ్గింది. గ్రాండ్ ఐ10 నియోస్ ధర రూ. 73,808 తగ్గింది.
సెప్టెంబర్ 22 నుంచి తగ్గనున్న హ్యుందాయ్ కార్ల ధరలు
September 07, 2025
0
Tags