అమెజాన్ ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్’ 2025లో షావోమీ 14 సీవీపై డిస్కౌంట్ ప్రకటించింది. 14 సీవీ మొబైల్‌ను షావోమీ గతేడాది జూన్‌లో విడుదల చేసింది. ఆ సమయంలో 8జీబీ + 256జీబీ వేరియంట్‌ను రూ.42,999 ధరకు విడుదల చేసింది. త్వరలో ఆరంభమయ్యే అమెజాన్ సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ రూ.27,999కి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. బ్యాంక్ ఆఫర్ అదనగంగా ఉంది. బ్యాంక్ ఆఫర్ తర్వాత రూ.26,499కు మీకు లభిస్తుంది. అన్ని ఆఫర్ల తర్వాత ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.16,499 తగ్గింపు లభిస్తుంది. షావోమీ 14 సీవీ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకమైన డిజైన్, అద్భుతమైన డిస్‌ప్లే, శక్తివంతమైన ప్రాసెసర్, గొప్ప కెమెరా సిస్టమ్‌తో వచ్చింది. ఈ ఫోన్ 6.55 ఇంచెస్ 1.5K కర్వ్‌డ్ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తోంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్‌ఓఎస్,120Hz రిఫ్రెష్ రేటు, 240Hz టచ్‌శాంప్లింగ్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 50 ఎంపీ ఓఐఎస్ కెమెరా, 50 ఎంపీ టెలిఫొటో, 12 ఎంపీ అల్ట్రావైడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీ కోసం రెండు 32 ఎంపీ కెమెరాలు ఉంటాయి. 4700 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ, 67 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.
అమెజాన్ ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్’ 2025లో షావోమీ 14 సీవీపై డిస్కౌంట్ ఆఫర్ !
September 13, 2025
0
Tags