అక్టోబర్ 16న ఏపీలో ప్రధాని మోడీ పర్యటన

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ కి ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు. అక్టోబర్ 16వ తేదీన కర్నూల్, నంద్యాల జిల్లాల్లో మోడీ పర్యటన సాగనుంది. పర్యటనలో భాగంగా శ్రీశైలం మల్లికార్జునస్వామిని దర్శించుకుంటారు. ఆ తరువాత కర్నూలులో కూటమి నేతలు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ముఖ్యనేతలతో కలిసి జీఎస్టీ సంస్కరణలపై భారీ ర్యాలీలో పాల్గోనున్నారు. ఆ తరువాత పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోడీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ మేరకు మోడీ పర్యటన వివరాలను శాసనమండలి లాబీలో సహచర మంత్రులు, ఎమ్మెల్సీల వద్ద మంత్రి నారా లోకేశ్ ప్రస్తావించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)