తెలంగాణలో 15 నుంచి వృత్తి విద్యా కళాశాలల నిరవధిక బంద్‌ !

Telugu Lo Computer
0


ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ బకాయిలు తక్షణం విడుదల చేయకపోతే ఈనెల 15 నుంచి కళాశాలలను నిరవధికంగా బంద్‌ చేయనున్నట్టు తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ప్రకటించింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ బాలకిష్టారెడ్డిని కలిసిన సమాఖ్య సభ్యులు పీజు రీయింబర్స్‌ మెంట్‌ బకాయిలు విడుదల చేసే వరకు బంద్‌ కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి రోజును ఇంజినీర్స్ డేగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆ రోజును బ్లాక్ డేగా ప్రకటిస్తూ ఇంజినీరింగ్, ఫార్మా, నర్సింగ్, ఎంబీఏ, ఎంసీఏ సహా వృత్తి విద్యా కళాశాలలు బంద్ నిర్వహిస్తాయని తెలిపారు. డిగ్రీ, పీజీ కాలేజీలు 16వ తేదీ బంద్ చేపట్టనున్నట్టు ప్రకటించాయి. రూ.10 వేల కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బాకాయిలు ఉన్నాయని, వాటిలో ఇప్పటికే టోకెన్లు విడుదల చేసిన రూ.1200కోట్లు అయినా ఈనెల 30వ తేదీ నాటికి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కళాశాలలు బంద్ కొనసాగిస్తే దాదాపు పది లక్షల మంది విద్యార్థులపై ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో ఉన్నత విద్యా మండలి, ప్రభుత్వం తక్షణం బకాయిలను విడుదల చేయాలని కళాశాలల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)