చాట్ జీపీటీ ఫ్రీ వర్షన్‌ను కొంత వరకు మాత్రమే వాడుకోగలం. ఫ్రీ వర్షన్‌లో ప్రతీ టాస్క్‌కు లిమిట్ ఉంది. పూర్తి స్థాయిలో చాట్ జీపీటీని వాడాలంటే పెయిడ్ వర్షన్ కి వెళ్లాల్సిందే. చాట్ జీపీటీ పెయిడ్ వర్షన్ మూడు ప్లాన్లలో అందుబాటులో ఉంది. చాట్ జీపీటీ గో, చాట్ జీపీటీ ప్లస్, చాట్ జీపీటీ ప్రో. చాట్ జీపీటీ ప్లస్ కోసం నెలకు ఏకంగా 2500 రూపాయల దాకా చెల్లించాల్సి ఉంటుంది. చాట్ జీపీటీ ప్రో కోసం ఏకంగా 25 వేల దాకా చెల్లించాల్సి ఉంటుంది. చాట్ జీపీటీ ఇండియన్ కస్టమర్స్‌ను దృష్టిలో పెట్టుకుని 'చాట్ జీపీటీ గో' ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్‌ను కొత్తగా లిస్టులో కూడా చేర్చింది. కేవలం 399 రూపాయలకే ఫ్రీ వర్షన్ కంటే బెటర్ టాస్కులను చేసుకునే అవకాశం కల్పిస్తోంది. చాట్ జీపీటీ గో ఫ్రీ ప్లాన్ కంటే కొంచెం బెటర్ అనే చెప్పాలి. ఫ్రీ ప్లాన్ లాగానే ఇందులో కూడా జీపీటీ 5 ను యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంది. మెసేజెస్, అప్‌లోడ్స్ లిమిట్స్ పరిమితి ఫ్రీ ప్లాన్ కంటే కొంత బెటర్‌గా ఉంటుంది. ఎక్కువ మొత్తంలో ఫొటోలను జనరేట్ చేసుకోవచ్చు. రీసెర్చ్ విషయంలో మాత్రం లిమిట్ ఉంది. డేటా ఎక్కువ రోజులు స్టోర్ అయి ఉంటుంది. డేటా అనాలసిస్‌కు కూడా స్కోప్ ఎక్కువగా ఉంటుంది. తక్కువ ధరలు పెడితే ఇండియాలో ఎక్కువ మంది సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటారని ఓపెన్ ఏఐ భావిస్తోంది.
ఇండియన్ కస్టమర్స్‌ను దృష్టిలో పెట్టుకుని 'చాట్ జీపీటీ గో' ప్లాన్
August 14, 2025
0
Tags