కేరళలో ఓనం పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు బోనస్ ను రూ. 500 పెంచారు. దీంతో వారందరికీ ఈ సారి పండుగ బోనస్ కింద రూ. 4,500 జీతంతో పాటు అదనంగా లభిస్తుంది. అయితే బోనస్ కు అర్హత లేని వారికి కూడా కొద్దిమేర పెంపుదల చేస్తూ రూ. 2,750 నుంచి రూ. 3,000లకు పెంచుతున్నట్లు ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి కేఎన్ బాల గోపాల్ వెల్లడించారు. అంతే కాకుండా ఓనం పండుగ సందర్భంగా పెన్షనర్లకు ప్రత్యేక పండుగ భత్యాన్ని ఇవ్వనున్నారు. రూ. 250 పెంచి దాన్ని రూ. 1,250కి ఖాయం చేశారు. దీంతో పెన్షన్ కింద రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ తీసుకుంటున్న వారికి ఈ మొత్తం లభించనుంది. ఇదిలా ఉండగా కేరళ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఉద్యోగులకు రూ. 20,000 ఓణం పండుగ అడ్వాన్స్ ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పార్ట్‌టైమ్, కంటింజెంట్ ఉద్యోగులు సహా ఇతర ఉద్యోగులకు అడ్వాన్స్ రూ. 6,000. గత సంవత్సరం దీనిని అందుకున్న కాంట్రాక్ట్-స్కీమ్ కార్మికులు సహా అన్ని వర్గాల ఉద్యోగులకు పండుగ భత్యం రూ. 250 పెంచారు. ఓణం పండుగ సందర్భంగా ప్రకటించిన ఈ ప్రత్యేక బోనస్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా 13 లక్షలకు పైగా ఉద్యోగులకు, కార్మికులకు చేరుతుంది.
ఓనం పండుగ ముందు బోనస్ ప్రకటించిన కేరళ ప్రభుత్వం
August 26, 2025
0
Tags