దేశీయ మార్కెట్లో లెనోవోఎంట్రీ-లెవల్ ట్యాబ్లెట్ ను విడుదల చేసింది. ఈ ట్యాబ్‌లో MediaTek Helio G85 ప్రాసెసర్, 4GB RAM తో పాటు 10.1-అంగుళాల Full-HD డిస్‌ప్లే (60Hz రిఫ్రెష్ రేట్) ఉంది. 5,100mAh బ్యాటరీతో వచ్చిన ఈ డివైస్ 15W చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. వినియోగదారులు Wi-Fi మాత్రమే లేదా Wi-Fi + LTE వెర్షన్‌లలో దీనిని ఎంచుకోవచ్చు. ఫోటోలు, వీడియో కాల్స్ కోసం 8MP రియర్ కెమెరా, డ్యూయల్ స్పీకర్లు ఉన్నాయి. 4GB RAM + 64GB స్టోరేజ్ కలిగిన Wi-Fi వెర్షన్ ధర రూ.10,999గా నిర్ణయించబడింది. అదే కాన్ఫిగరేషన్‌కి Wi-Fi + LTE కనెక్టివిటీతో కూడిన వెర్షన్ ధర రూ. 12,999గా ఉంది. 4GB RAM + 128GB స్టోరేజ్ కలిగిన Wi-Fi మోడల్ ధర రూ. 11,998గా ఉంది. ఈ ట్యాబ్స్ పోలార్ బ్లూ కలర్‌లో అందుబాటులో ఉంటుంది. లెనోవో వెబ్ సైట్, లెనోవో ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్, ఈ-కామర్స్ వెబ్‌సైట్లు ఇంకా ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో దీనిని కొనుగోలు చేయవచ్చు. ఇదే ఈవెంట్‌లో లెనోవో ఐడియా ట్యాబ్ కూడా ప్రకటించింది. దీని ప్రారంభ ధర రూ.16,999. Android 14 ఆధారంగా Lenovo ZUI 16, 2 సంవత్సరాల Android OS అప్‌గ్రేడ్‌లు, 4 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచులు. 10.1 అంగుళాల Full-HD (1,200×1,920) పిక్సెల్స్, 60Hz రిఫ్రెష్ రేట్, 400 nits బ్రైట్‌నెస్, TÜV Low Blue Light సర్టిఫికేషన్. MediaTek Helio G85 ఆక్టా-కోర్. ర్యామ్, స్టోరేజ్: 4GB LPDDR4X RAM, గరిష్టంగా 128GB eMMC స్టోరేజ్. 8MP రియర్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా. ఆడియో:డ్యూయల్ స్పీకర్లు డాల్బీ ఆటమ్స్ ట్యూనింగ్‌తో మెటల్ బాడీ డిజైన్. బ్లూటూత్ 5.3, Wi-Fi 5, పేస్ అన్ లాక్ సపోర్ట్. ఇన్‌బిల్ట్ కిక్‌స్టాండ్ ఉన్న క్లియర్ కేస్, స్టాండ్ బై మోడ్ ,బ్యాటరీ: 5,100mAh, 15W ఫాస్ట్ చార్జింగ్. సైజు 9.5 × 235.7 × 154.5 మిమీ.
లెనోవో ఎంట్రీ-లెవల్ ట్యాబ్లెట్ విడుదల
August 13, 2025
0
Tags