తెలంగాణ పంచాయతీ ఎన్నికలు : తుది ఓటర్ల జాబితా విడుదలకు నోటిఫికేషన్ జారీ చేసిన ఈసీ

Telugu Lo Computer
0


తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ కేంద్రాలు, తుది ఓటర్ల జాబితా విడుదలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.  తుది ఓటర్ల జాబితాను సెప్టెంబర్ 2న ప్రదర్శించాలని అధికారులకు ఈసీ ఆదేశాలు ఇచ్చింది. ఈ నెల 28న గ్రామ పంచాయతీ, మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో డ్రాఫ్ట్ రోల్స్ ప్రదర్శిస్తారు. ఈ నెల 29న జిల్లా స్థాయి సమావేశం, 30న మండల స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తారు. ఆగస్టు 28 నుంచి 30వ తేదీ మధ్య అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఆగస్టు 31న వాటిని పరిష్కరిస్తారు. ఇక వచ్చే నెల 2న ఓటర్ల తుది జాబితా విడుదల చేయనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు జూన్ 25న తుది తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. గ్రామ పంచాయతీ ఎన్నికలను 3 నెలల్లో నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీలైనంత త్వరగా వార్డుల విభజన పూర్తిచేసి, ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘానికి సూచనలు చేసింది. ఇక 2024 జనవరి 31వ తేదీన సర్పంచుల పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే. 

Post a Comment

0Comments

Post a Comment (0)