తెలంగాణ విద్యారంగం అభివృద్ధికి తమ వంతుగా సేవలు అందిస్తాం : అమిటీ యూనివర్సిటీ ఛాన్స్‌లర్

Telugu Lo Computer
0


ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అమిటీ యూనివర్సిటీ ఛాన్స్‌లర్ అతుల్ చౌహాన్ కలిసి  తెలంగాణ విద్యారంగం అభివృద్ధికి తమ వంతుగా సేవలు అందిస్తామని తెలిపారు. తెలంగాణలో తమ యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసినందుకు అతుల్ చౌహాన్ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీతో తాము ఒప్పందం చేసుకుంటామని, స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాల్లో భాగస్వాములవుతామని చౌహాన్ సీఎంకు తెలియజేశారు. మెరుగైన వసతులు, నాణ్యమైన విద్యా బోధనతో ఇప్పటికే అమిటీకి మంచి పేరు ఉందన్నారు. తెలంగాణలో మరింతగా రాణించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.  

Post a Comment

0Comments

Post a Comment (0)