పబ్లిక్ మీటింగ్‌లో ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై నిన్న ఊహించని విధంగా దాడి జరిగింది. ఈ ఘటన తర్వాత ఢిల్లీ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కీలక మార్పు వచ్చింది. కొత్త పోలీస్ కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సతీష్ గోల్చాను నియమించారు. దీనికి సంబంధించి ఈరోజు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం ఢిల్లీ డీజీ (ప్రిజన్స్)గా ఉన్న సతీష్ గోల్చా ఇకపై ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా వ్యవహరిస్తారు. ఆయన చార్జ్ తీసుకున్న రోజు నుంచి ఈ నియామకం అమలులోకి వస్తుందని నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు.
ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా సతీష్ గోల్చా
August 21, 2025
0
Tags