ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, ఆటో, మెటల్, ఫార్మా షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు అంచనాలకు తగ్గట్టు రావడంతో సెప్టెంబర్‌లో ఫెడ్ వడ్డీ రేట్లలో కోత ఉంటుందన్న అంచనాలతో ఆసియా మార్కెట్లతో పాటు మన మార్కెట్ సూచీలు రాణించాయి. దేశీయంగానూ రిటైల్ ద్రవ్యోల్బణం 8 ఏళ్ల కనిష్ఠానికి చేరడం పాజిటివ్ సెంటిమెంట్‌కు కారణమైంది. ఈ క్రమంలో నిఫ్టీ మళ్లీ 24,600 స్థాయిని అందుకుంది. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో సెన్సెక్స్ ఉదయం 80,492.17 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 80,235.59) లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా లాభాల్లోనే కదలాడింది. ఇంట్రాడేలో 80,683.74 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 304.32 పాయింట్ల లాభంతో 80,539.91 వద్ద ముగిసింది. నిఫ్టీ 131.95 పాయింట్ల లాభంతో 24,619.35 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 87.43గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో బీఈఎల్, ఎటెర్నెల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. అదానీ పోర్ట్స్, ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, టైటాన్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.
ఆటో, మెటల్, ఫార్మా షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
August 13, 2025
0
Tags