తెలంగాణలో ఇవాళ అర్ధరాత్రి నుంచి ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేయాలని నెట్‌వర్క్ ఆసుపత్రులు నిర్ణయించారు. రూ.1300 కోట్ల పెండింగ్ బకాయిలు చెల్లించకపోతే సెప్టెంబర్ 1 నుంచి సేవల్ని నిలిపివేస్తామని ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాశామని, అయినా స్పందన రాలేదని ఆసుపత్రుల యాజమాన్యాలు పేర్కొన్నాయి. బిల్లుల పెండింగ్‌తో చిన్న, మధ్యస్థాయి ఆసుపత్రులు మూసివేసే పరిస్థితి ఉందని ఆందోళన ఉద్యోగ, జర్నలిస్టు ఆరోగ్య వైద్య సేవలు నిలిపివేయనున్నట్లు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చిన్న, పెద్ద ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల వైద్య బిల్లుల బకాయిలు పెండింగ్ పెట్టింది ప్రభుత్వం. దీంతో ఆసుపత్రులపై ఆర్థిక భారం పెరిగిపోతుందని, చిన్న ఆసుపత్రులు మూసుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 31వ తేదీ అర్ధరాత్రి నుండి అన్ని ఆరోగ్యశ్రీ, ఉద్యోగ, జర్నలిస్టు వైద్య సేవలను నిలిపివేయనున్నట్టు ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోకు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ లేఖ రాసింది. ఇవాళ అర్ధరాత్రి నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేయాలని నిర్ణయించారు నెట్‌వర్క్ ఆసుపత్రులు. రూ.1300 కోట్ల పెండింగ్ బకాయిలు చెల్లించకపోతే సెప్టెంబర్ 1 నుంచి సేవల్ని నిలిపివేస్తామని ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాశామని, అయినా స్పందన రాలేదని ఆసుపత్రుల యాజమాన్యాలు పేర్కొన్నాయి .
తెలంగాణలో అర్థరాత్రి నుండి ఆరోగ్య శ్రీ సేవలు బంద్ !
August 31, 2025
0
Tags