ఎర్రచందనం స్మగ్లర్ నాగ దస్తగిరి రెడ్డి అరెస్టు

Telugu Lo Computer
0


ర్రచందనం స్మగ్లర్ నాగ దస్తగిరి రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నాగ దస్తగిరితో పాటు మరో ఐదుగురు స్మగ్లర్లను మైదుకూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. మైదుకూరు సబ్ డివిజన్ పరిధిలో ఆరుగురిని ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అశోక్ కుమార్ వివరించారు. వారి నుంచి ఒక టన్ను ఎర్రచందనం దుంగలు, రెండు కార్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ అరెస్టులో.. మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ ఇరగంరెడ్డి నాగదస్తగిరి రెడ్డి పట్టుబడినట్లు తెలిపారు. నాగ దస్తగిరిపై ఇప్పటికే 86 ఎర్రచందనం కేసులు, 34 చోరీ కేసులు, మూడు పీడీ యాక్టు కేసులు ఉన్నాయని తెలిపారు. అతని భార్య లాలుబీని కూడా వారం క్రితం పోలీసులు అరెస్టు చేసినట్లు ఎస్పీ అశోక్ వెల్లడించారు. నాగ దస్తగిరిని అరెస్ట్ చేసిన మైదుకూరు పోలీసులను ఎస్పీ అభినందించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)