తెలంగాణలో సివిల్ సర్వీసెస్ పరీక్ష కోసం శిక్షణ పొందుతున్న అభ్యర్ధులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు రేయింబవళ్లు కృషి చేస్తున్న అభ్యర్ధులకు ఆర్ధికంగా అండగా నిలిచేందుకు కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. వారి కోసం 'రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం' పేరుతో కొత్త పథకాన్ని ఇటీవల అందుబాటులోకి తెచ్చింది. ఈ పథకం కింద సివిల్స్ పరీక్షల్లో ప్రిలిమ్స్ క్వాలిఫై అయి మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్థుల శిక్షణ కోసం రూ.1 లక్ష అందిస్తుంది. తాజాగా సివిల్స్-2025 మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించిన 178 మంది అభ్యర్థులకు అధికారులు చెక్కులు అందజేశారు. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్.. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల ద్వారా యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షకు అర్హత సాధించిన రాష్ట్ర అభ్యర్థులకు ఈ పథకం రూ. 1 లక్ష ఆర్థిక సహాయం అందిస్తోంది. అందులో భాగంగానే ఈ ఏడాది మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించిన 178 మంది అభ్యర్థులకు ఒక్కొక్కరికి రూ. లక్ష సాయం చేశారు. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకానికి అప్లై చేసుకోవాలంటే అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రంలో శాశ్వత నివాసి అయి ఉండాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వర్గాలకు చెందినవారై ఉండాలి. అంతేకాక అభ్యర్థి యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. దాంతోపాటు దరఖాస్తుదారుల కుటుంబ వార్షిక ఆదాయం రూ. 8 లక్షల లోపు ఉండాలి.
సివిల్ సర్వీసెస్ పరీక్ష కోసం శిక్షణ పొందుతున్న అభ్యర్ధులకు ఒక్కొక్కరికి రూ. లక్ష సాయం
August 11, 2025
0
Tags