తెలంగాణలోని భద్రాద్రి జిల్లాలో వ్యవసాయశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నరసింహారావును లంచం తీసుకుంతుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఎరువుల దుకాణం యజమాని నుంచి లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ సిబ్బంది నిర్వహించిన ఆపరేషన్‌లో పట్టుబడ్డాడు. ఎరువుల దుకాణం నిర్వహణకు సంబంధించిన అనుమతుల విషయంలో సాయం చేస్తానని హామీ ఇచ్చిన నరసింహారావు, ఎరువుల దుకాణం యజమాని నుంచి రూ.25 వేల లంచం కోరాడు. దీనిపై విసిగిపోయిన వ్యాపారవేత్త ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ముందుగా పథకం ప్రకారం ఉచ్చుపన్నిన ఏసీబీ, నరసింహారావు లంచం తీసుకుంటున్న క్షణంలోనే పట్టుకుని అరెస్టు చేసింది. ప్రస్తుతం ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అధికారి ఇల్లు, కార్యాలయంలో శోధనలు కొనసాగుతున్నాయని సమాచారం.
ఏసీబీ వలలో చిక్కిన వ్యవసాయశాఖ అసిస్టెంట్ డైరెక్టర్
August 25, 2025
0
Tags