చైనాలో ఓ యవకుడు ఓ యువతిని ప్రేమించాడు. ఎలాగోలా తన ప్రేమ వ్యవహారాన్ని పెళ్లి వరకు తీసుకొచ్చాడు. అయితే వివాహానికి ముందు తనకు ఓ షాకింగ్ విషయం తెలిసింది. తనతో ప్రేమలో పడక ముందే వేరే వారితో ఎఫైర్ నడిపించినట్లు వెల్లడైంది. అందుకు సంబధించిన వీడియో కూడా వరుడికి దొరికింది. అయితే ఈ విషయాన్ని ఆ వధువు ఎప్పుడూ అతడి ముందు చెప్పలేదు. అయితే వధువు తనను చీట్ చేసిందని భావించిన వరుడు ఆమె మోసాన్ని పెళ్లికి వచ్చిన బంధువులు, ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులకు చెప్పాలని షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. పెళ్లి జరుగుతున్న సమయంలో తన లవ్ జర్నీని వరుడు వివరించసాగాడు. అలా విషయాలు అన్నీ చెబుతూ పెళ్లి మండపంపై వెనకున్న ఓ స్క్రీన్ పై వీడియో ప్లే చేశాడు. ఆ వీడియో చూసి అంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఆ వీడియోలో వధువు తన సోదరి భర్తతో శృంగారం చేస్తోంది. ఈ వీడియో ఏకంగా నాలుగు నిమిషాలు ఉండడంతో వధువు గట్టిగా కేకలు వేస్తూ యూ చీటర్ అంటూ స్టేజీ దిగి వెళ్లిపోయింది. ఆ వీడియోను వధువు సోదరి వరుడికి ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం అందుకు సంబంధించిన వార్త సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
పెళ్లి మండపంపై వధువుపై రివెంజ్ తీర్చుకున్న వరుడు !
August 01, 2025
0
Tags