ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా, సత్తెనపల్లి రఘురామ్‌నగర్‌లోని పద్మజ నివాసం ఉంటున్నారు. ఆమె గురువారం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు. పద్మజ బయటకు వెళ్లిన కొద్దిసేపటికి ఓ దొంగ అటువైపుగా వచ్చి ఇంటి తలుపుకు తాళం పగులగొట్టి డోర్ తీసి లోపలికి అడుగుపెట్టాడు. వెంటనే పెద్ద శబ్ధం వచ్చింది.. వెంటనే భయంతో ఆ దొంగ అక్కడి నుంచి బయటకు పరుగులు తీశాడు. ఏం జరిగిందని ఆరా తీస్తే ఆ తర్వాత అసలు మ్యాటర్ బయటపడింది. పద్మజ తన ఇంటిలో ఎవరైనా తలుపులు తీయగానే తన మొబైల్‌కు మెసేజ్ వచ్చేలా ఓ పరికరాన్ని తలుపు దగ్గర బిగించారట. ఆ తర్వాత అలారం మోగేలా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే దొంగ రాగానే అలారం మోగింది. వెంటనే ఆ శబ్ధానికి అక్కడి నుంచి పారిపోయాడు. దొంగ తాళం పగులగొట్టిన ఘటనపై పద్మజ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఇంటిని పరిశీలించి సీసీ ఫుటేజ్ చెక్ చేశారు. అందులో దొంగ తాళం పగులగొట్టి తలుపు తీస్తున్న దృశ్యం రికార్డ్ అయ్యింది. పోలీసులు దీని ఆధారంగా దొంగను పట్టుకునేందుకు ప్రయత్నంలో ఉన్నారు.
దొంగతనానికి వచ్చిన దొంగ : అలారం మోగగానే పరుగో...పరుగు !
August 08, 2025
0
Tags