ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు ఒక ప్రీపెయిడ్ ఆఫర్ "ఆజాదీ కా ప్లాన్"ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ కేవలం రూ.1కి అందుబాటులో ఉండటం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే, ఈ ప్లాన్‌ను బీఎస్ఎన్ఎల్ కొత్త ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించింది. ఇది ప్రమోషనల్ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్‌గా తీసుకవచ్చింది బీఎస్ఎన్ఎల్. ఆగస్టు 1 నుంచి ఆగస్టు 31 వరకు మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. బీఎస్ఎన్ఎల్ "ఆజాదీ కా ప్లాన్" కేవలం కొత్త వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. కొత్తగా బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌కు చేరే వారు ఈ ఆఫర్‌ను పొందవచ్చు. ఇది మిగిలిన యాక్టివ్ లేదా ఎగ్జిస్టింగ్ యూజర్లకు వర్తించదు. ఈ ఆఫర్ ద్వారా వినియోగదారులు కేవలం రూ.1 చెల్లించి 30 రోజుల పాటు ప్రయోజనాలను పొందవచ్చు, ఇందులో భాగంగా అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ (లొకల్, నేషనల్), రోజుకు 2GB హై-స్పీడ్ డేటా, ప్రతి రోజు 100 SMSలు ఉచితం లభిస్తాయి. ఈ ప్రయోజనాలు అన్ని కూడా బీఎస్ఎన్ఎల్ 3G, 4G నెట్‌వర్క్‌లపై లభిస్తాయి.
కొత్త వినియోగదారులకు బీఎస్ఎన్ఎల్ "ఆజాదీ కా ప్లాన్"
August 01, 2025
0
Tags