పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా రూపాంతరం చెందుతోంది. బలమైన రుతుపవన గాలులు తోడవడంతో మరికొద్ది గంటల్లోనే బలపడి తీవ్ర ప్రభావం చూపించనుంది. ఈనెల 19న తీరం దాటుతుందని అంచనా వేస్తుండగా ఉత్తరాంధ్ర జిల్లాలలో ఉదయం నుంచి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ, అనకాపల్లి,కోనసీమ, కాకినాడ, వెస్ట్ గోదావరి జిల్లాలకు రెడ్ అలెర్ట్ హెచ్చరికలు జారీ అయ్యాయి. విశాఖ నగరంలో విడతలు విడతలుగా అతి భారీ వర్షం కుమ్మేస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులపై వర్షం నుంచి ఉదృతంగా ప్రవహిస్తోంది. బీచ్ రోడ్డులో ఎర్రటి నీరు ముంచెత్తింది. సముద్రం సైతం రెడ్ కలర్లో కి మారిపోయింది. జ్ఞానాపురం, ఇసుక తోట, KRM కాలనీ, వన్ టౌన్ ఏరియాలోని కొన్ని ప్రాంతాలు జలమయం అయ్యాయి. మరో మూడు రోజులు ఇదే వాతావరణం కొనసాగుతూ అత్యంత భారీ వర్షాలు నమోదు హెచ్చరికలు ఉన్నాయి. దీంతో జీవీఎంసీ పార్టీ స్థాయి సన్నద్ధత తో పనిచేస్తోంది. తీరం దాటిన తర్వాత వాయుగుండం అధిక ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది. కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలకు ఆస్కారం వుంది. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, ఈస్ట్ గోదావరి, ఏలూరు ,కృష్ణ బాపట్ల, పల్నాడు ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ అయ్యాయి. కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్ కడప, నెల్లూరు, తిరుపతి, చిత్తూరులో ఎల్లో బులెటిన్ హెచ్చరికలు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో కొద్ది గంటల వ్యవధిలోనే 11 సెంటీమీటర్ల వర్ష పాతం నమోదైంది. వాయుగుండం కారణంగా ఉత్తరాంధ్ర తీరంలో సముద్రం అలజడి సృష్టిస్తోంది. బలమైన కెరటాలు ఎగిసిపడుతున్నాయి. తీరం వెంబడి, అవతల 40 నుంచి 50కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. తీరం దాటే సమయంలో 60కి.మీ గరిష్ఠ వేగం వుంటుందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని అన్ని పోర్టుల్లోనూ 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే వర్షాలు కారణంగా భూగర్భ జలాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు విస్తారంగా నమోదైతే ఫ్లాష్ ఫ్లడ్స్ వంటి ప్రమాదం ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
August 18, 2025
0
Tags