కొత్తగా తీసుకువచ్చే ప్రజా సంక్షేమ పథకాల్లో జీవించి ఉన్న నేతల పేర్లు వాడొద్దని తమిళనాడు ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే వాటి గురించి ప్రచారం చేసేటప్పుడు మాజీ ముఖ్యమంత్రుల చిహ్నాలు, డీఎంకే పార్టీ గుర్తులు, జెండాను ఉపయోగించకుండా నిషేధించింది. ఈ మేరకు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అన్నాడీఎంకే పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు సీవీ షణ్ముగం వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై మద్రాస్ హైకోర్టులో తాజాగా విచారణ జరిగింది. 'Ungaludan Stalin' పేరిట రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న ప్రచార కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్టాలిన్ పేరును ఉపయోగించడాన్ని షణ్ముగం సవాల్ చేశారు. ఈ అంశంపై తాము ఇచ్చిన ఉత్తర్వులు ఏ ప్రభుత్వ పథకం ఆవిష్కరణ, అమలుకు అడ్డంకి కాబోదని న్యాయస్థానం స్పష్టం చేసింది. అలాగే ఈ వ్యాజ్యంపై రాష్ట్ర ప్రభుత్వం, డీఎంకే పార్టీ తమ స్పందనలు తెలియజేయాలని ఆదేశాలు ఇచ్చింది.
ప్రజా సంక్షేమ పథకాల్లో జీవించి ఉన్న నేతల పేర్లు వాడొద్దు : తమిళనాడు ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
August 01, 2025
0
Tags