గురుగావ్‌కు చెందిన ఓ మోడల్ క్యాబ్ బుక్ చేసుకుంది. క్యాబ్ కోసం రాజీవ్ చౌక్‌లో ఎదురు చూస్తూ ఉంది. ఈ క్రమంలో ఆ యువతికి కొంత దూరంలో నిల్చున్న వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. అందరూ చూస్తుండగానే ప్యాంట్ జిప్ తీసి ఆమెకు ఎదురుగా అటు, ఇటు తిరగడం మొదలు పెట్టాడు. ఈ హఠాత్పరిణామంతో ఆ మోడల్ భయాందోళనకు గురైంది. అతడి ప్రవర్తనతో విసిగిపోయి ఈ తతాంగాన్నంత వీడియో తీసింది. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ సంఘటన నన్ను భయపెట్టింది కానీ మౌనం వహించకూడదని భావించాను. అందుకే వీడియో తీసి ప్రజల దృష్టికి తీసుకువచ్చాను. ఇలాంటి మనుషులు బహిరంగ ప్రదేశాల్లో సంచరించడానికి వీల్లేదు. అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని కోరింది. ఈ ఘటనపై ఆమె స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వీడియో ఆధారంగా నిందితుడిని గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. "ఇలాంటి అసభ్య ప్రవర్తన నేరంగా పరిగణించబడుతుంది. మహిళ భద్రత కోసం తగిన చర్యలు తీసుకుంటాము," అని గురుగ్రామ్ పోలీసులు పేర్కొన్నారు.
క్యాబ్ కోసం ఎదురు చూస్తున్న యువతికి ప్యాంటు జిప్ తీసి అసభ్యంగా ప్రవర్తించిన యువకుడు !
August 08, 2025
0
Tags