మీ సందేశం నా మనసుకు హత్తుకుంది : చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన రజనీకాంత్‌

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సినీ నటుడు రజనీకాంత్‌ ధన్యవాదాలు తెలిపారు. తలైవా ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా రెండు రోజుల నుంచి సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఆయనకు అభినందనలు తెలిపారు. చంద్రబాబు పోస్ట్‌ను షేర్‌ చేసిన రజనీకాంత్‌ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ''మీ మాటలు నా హృదయాన్ని తాకాయి. మీ అభినందనలు నాకు ఆనందాన్నిచ్చాయి. మీ సందేశం నా మనసుకు హత్తుకుంది. ఈ శుభాకాంక్షలు నాలో స్ఫూర్తి నింపాయి. మీ లాంటి వ్యక్తుల ప్రేమ, స్నేహంతో నేను సినిమా పరిశ్రమలో ఉత్తమంగా రాణించడానికి కృషిచేస్తాను'' అంటూ చంద్రబాబుకు రజనీకాంత్‌ థాంక్స్ చెప్పారు. ఆగస్టు 15 నాటికి సూపర్‌ స్టార్‌ ఇండస్ట్రీలో ప్రవేశించి 50 ఏళ్లు పూర్తయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న ఫొటోను పంచుకొని ఏపీ సీఎం శుభాకాంక్షలు తెలిపారు. రజనీకాంత్‌ తన సినిమాలతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా సందేశాలు కూడా ఇస్తారని కొనియాడారు. సామాజిక సమస్యలపై కూడా పలు చిత్రాలు తీశారని, అవి ఎంతోమందిని కదిలించాయని తెలిపారు. ఎక్స్ వేదికగా ప్రధాని మోడీ కూడా రజనీకాంత్‌కు విషెస్‌ చెప్పారు. ఆయన పోషించిన వైవిధ్యమైన పాత్రలు ప్రేక్షకులపై ఎంతో ప్రభావం చూపాయన్నారు. ఇలాగే మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు. మోదీకి సైతం రజనీకాంత్‌ కృతజ్ఞతలు తెలిపారు. తానెంతగానో గౌరవించే నాయకుడి నుంచి అభినందనలు రావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ పోస్టు పెట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)