ఎన్టీఆర్ పెద్ద కోడలు పద్మజ మృతి

Telugu Lo Computer
0


సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కోడలు, చైతన్యకృష్ణ తల్లి, జయ కృష్ణభార్య పద్మజ 73 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యతో బాధపడుతూ మరణించింది. శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బందులు పడుతూ ఈరోజు తెల్లవారుజామున హాస్పటల్లో చేర్పించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ విషయం విన్న వెంటనే అటు నందమూరి అభిమానులు, కార్యకర్తలు, నేతలు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడ నుంచి హుటాహుటిగా హైదరాబాద్ కి బయలుదేరారు. ఢిల్లీ నుంచి దగ్గుబాటి పురేందేశ్వరి తో నందమూరి కుటుంబ సభ్యులు ఇతర ప్రాంతాలలో ఉన్నప్పటికీ హుటాహుటిగా బయలుదేరి హైదరాబాద్ కి వస్తున్నారు. పద్మజ ఎన్టీఆర్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి స్వయానా సోదరి.

Post a Comment

0Comments

Post a Comment (0)