తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే పలు రైళ్లు రద్దు, దారి మళ్లింపు

Telugu Lo Computer
0


తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేయటం, మరి కొన్నింటిని దారి మళ్లిస్తూ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రద్దయిన, దారి మళ్లించిన రైళ్ల వివరాలను సౌత్ సెంట్రల్ రైల్వే వెల్లడించింది. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల తో రైల్వే యంత్రాంగం అప్రమత్తం అయింది. నదుల ప్రవాహం ఎక్కువగా ఉండటం, పలు వాగులు పొంగుతున్నాయి. గుంటూరు - నడిగూడె మార్గంలో వాగులు రైల్వే ట్రాక్ కు సమీపంలో ప్రవహిస్తున్నాయి. ఈ మార్గంలో రైళ్లను పరిస్థితికి అనుగుణంగా వేగం తగ్గించి జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. మరింతగా ప్రవాహం పెరిగితే అవసరమైన నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెప్పారు. ఆగస్టు 14 నుంచి 18వ తేదీ వరకు రద్దయిన రైళ్ల వివరాలను అధికారులు ప్రకటించారు. డోర్నకల్‌- విజయవాడ (ట్రెయిన్ నెంబర్ 67767), విజయవాడ- డోర్నకల్‌ (ట్రెయిన్ నెంబర్ 67768), కాజీపేట- డోర్నకల్ (ట్రెయిన్ నెంబర్ 67765) డోర్నకల్‌ - కాజీపేట (ట్రెయిన్ నెంబర్ 67766), విజయవాడ- సికింద్రాబాద్ (ట్రెయిన్ నెంబర్ 12713), సికింద్రాబాద్‌- విజయవాడ (ట్రెయిన్ నెంబర్ 12714), విజయవాడ- భద్రాచలం రోడ్ (ట్రెయిన్ నెంబర్ 67215), భద్రాచలం రోడ్‌- విజయవాడ (ట్రెయిన్ నెంబర్ 67216), గుంటూరు- సికింద్రాబాద్ (ట్రెయిన్ నెంబర్ 12705), సికింద్రాబాద్‌- గుంటూరు (ట్రెయిన్ నెంబర్ 12706) రద్దు చేసారు. తొమ్మిది రైళ్లను దారి మళ్లించనున్నారు. ఇంకో మూడు రైళ్లు ఆలస్యంగా బయల్దేరనున్నాయి. అదే విధంగా మరో రెండు రైళ్లు పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)