ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విశ్వవ్యాప్తమౌతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం దీనిపై ఉచితంగా ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు కేంద్ర విద్య మంత్రిత్వ శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల కోసం స్వయం పోర్టల్‌లో ఉచితంగా ఏఐ కోర్సులను అందిస్తోంది. దీని ద్వారా విద్యార్థులు సాంకేతికతలో తాజా మార్పులకు అనుగుణంగా తమ పరిజ్ఞానాన్ని పెంచుకోవచ్చు. స్వయం ప్లాట్‌ఫామ్ ద్వారా పాఠశాల నుండి పోస్ట్-గ్రాడ్యుయేషన్ స్థాయి వరకు ఉచిత ఆన్‌లైన్ విద్యా అవకాశాలను అందిస్తోంది. వివిధ రంగాల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కు పెరుగుతున్న ప్రాముఖ్యత నేపథ్యంలో ఈ కోర్సులు.. ఫ్యూచర్ టెక్నాలజీ, సరికొత్త ఆవిష్కరణలు, పరిశోధన వంటి రంగాలలో విద్యార్థులు రాణించడానికి అవసరమైన నైపుణ్యాలను అందించగలుగుతాయని కేంద్రం పేర్కొంది. పైథాన్ ఉపయోగించడం ద్వారా ఈ కోర్సుకు సంబంధించి విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ వంటి ప్లాట్ ఫామ్ లపై బేసిక్ అంశాలపై శిక్షణ పొందవచ్చు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఉచిత కోర్సులు అందించనున్న కేంద్ర ప్రభుత్వం
August 17, 2025
0
Tags