రూపాయలకే టీ షర్ట్, రూపాయికే బట్టలు అని సోషల్ మీడియాలో ప్రచారం : కొత్తగా పెట్టిన బట్టల షాప్ ముందు క్యూ

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరులో రెండు రూపాయలకే టీ షర్ట్, రూపాయికే బట్టలు అని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దీంతో నెల్లూరు సిటీలో జనం ఆ కొత్తగా పెట్టిన బట్టల షాప్ ముందు క్యూ కట్టారు. తీరా అక్కడికి వెళ్లి చూస్తే ఆ షాప్ ఓనర్లు షెట్టర్ దించేశారు. షాప్ ఓపెనే చేయలేదు. అసలు బట్టలు ఒక్కరికి అయినా ఇచ్చారా అని కస్టమర్లు మండిపడ్డారు. గొడవ పెద్దది కావడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. యాజమాన్యం అసత్య ప్రచారాలతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. నెల్లూరు సిటీలోని నిప్పో సెంటర్ దగ్గర పుట్టవీధి మెయిర్ రోడ్లో ఆర్జేఆర్ హెర్బల్ క్లినిక్ బిల్డింగ్ పైన ఆరోన్ గార్మెంట్ పేరుతో కొత్తగా ఒక బట్టల కొట్టు పెట్టారు. ప్రారంభ ఆఫర్ కింద రూపాయికే టీ షర్ట్, రెండు రూపాయలకు ప్యాంట్ అని ఇన్ స్టాగ్రాంలో, సోషల్ మీడియాలో ఊదరగొట్టారు. అసత్య ప్రచారం చేయడంతో కృష్ణాష్టమి పండగ పూట జనం షాప్ ముందు పడిగాపులు కాశారు. ఆరోనా గార్మెంట్ దగ్గర జనాలు గుమిగూడారు. అక్కడ జనాలు పోగవడం చూసి ఆ దారిన వెళ్లే వాళ్లు ఏం జరిగిందోనని ఆగారు. ఇలా ఫుల్ క్రౌడ్తో రోడ్డు నిండిపోయింది. పోలీసులు రంగ ప్రవేశం చేశారు. అంతమంది జనం వచ్చేసరికి నష్టపోతాడనే భయంతో ఇవ్వలేదో మరేదైనా కారణం ఉందో గానీ అలాంటి ఆఫర్ ఏం లేదని తేలిపోయింది. క్లాత్ షాప్ ఓనర్ ఫేక్ క్యాంపెయిన్ కారణంగా గంటల కొద్దీ పడిగాపులు కాయాల్సి వచ్చిందని కొందరు తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోగా, మరికొందరు మాత్రం బట్టల దుకాణం తెరుచుకుంటుందేమోనని ఆశగా అక్కడే ఎదురు చూస్తూ ఉండిపోయారు.


Post a Comment

0Comments

Post a Comment (0)