అత్త మాట తీరు అవమానంగా ఫీల్ అయ్యి చంపిన అల్లుడు

Telugu Lo Computer
0


ర్ణాటకలోని తుమకూరు జిల్లా కోలాల గ్రామ రోడ్డు పక్కన ప్లాస్టిక్ కవర్లలో మానవ అవయవాలు కనిపించాయి. స్థానికులు ఓ కుక్క నోట్లో మానవ చెయ్యి భాగం చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆ ప్రాంతం జల్లెడ పట్టారు. మొదట ఏడు కవర్లు, తర్వాత ఇంకొన్ని వెతికిన తర్వాత మొత్తం 14 కవర్లలో మానవ శరీర భాగాలు లభించాయి. కొన్ని భాగాలు కుళ్లిపోయిన స్థితిలో ఉండటం విచారం కలిగించింది. ఒక కవర్‌లో తల భాగం లభించడంతో మృతురాలు లక్ష్మీదేవి (42) అని గుర్తించారు. ఆమె అదే గ్రామానికి చెందిన వ్యక్తి. కుటుంబ సభ్యుల సమాచారం ఆధారంగా విచారణ మొదలుపెట్టిన పోలీసులు, ఆమె అల్లుడు పై నిఘా పెట్టారు. పోలీసుల దర్యాప్తులో ఆమె అల్లుడు, డెంటల్ డాక్టర్ అయిన రామచంద్రప్ప హత్య చేసినట్లు తేలింది. అత్తపై చాలా కాలంగా అతనికి అసహనం ఉన్నట్లు తెలిసింది. ఆమె మాటల తీరుతో అవమానంగా ఫీల్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. రామచంద్రప్ప, తన స్నేహితులు కేఎన్ సతీష్, కేఎస్ కిరణ్ సహాయంతో లక్ష్మీదేవిని హత్య చేశాడు. మృతదేహాన్ని 19 ముక్కలుగా కోసి, ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసి, రోడ్డు పక్కన పడేశాడు. వారంతా కలిసి మృతదేహాన్ని ముక్కలుగా చేసి, ఆధారాలు చెరిపేయాలనే ఉద్దేశంతోనే మృతదేహాన్ని భాగాలుగా విడగొట్టారు. అనంతరం వివిధ ప్రదేశాల్లో కవర్లను పారవేశారు. పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేసి, మూడు రోజుల లోపే నిందితులను అరెస్ట్ చేశారు. విచారణలో నిందితులు హత్యకు సంబంధించిన విషయాలన్నీ అంగీకరించారని అధికారులు తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)