ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగులకు ఉచితంగా బైక్స్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం ద్వారా దివ్యాంగులు తమ రోజువారీ జీవితంలో ఎదుర్కొనే రవాణా ఇబ్బందులను అధిగమించి, స్వయం ప్రతిపత్తిని సాధించేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పథకానికి అర్హులైన వారు అక్టోబర్ 31వ తేదీలోపు www.apdascac.ap.gov.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవాలంటే, దరఖాస్తుదారులు ఆంధ్రప్రదేశ్‌లో శాశ్వత నివాసి అయి ఉండాలి, 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి, కనీసం 70% కంటే ఎక్కువ వైకల్యం కలిగి ఉండాలి. కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వార్షిక ఆదాయం రూ. 3 లక్షల కంటే తక్కువగా ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటం, గతంలో ఏ వాహనం తీసుకోకపోవడం వంటి షరతులు ఉన్నాయి. దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు, అర్హత ధృవీకరణ పత్రం, ఎస్‌ఎస్‌సి సర్టిఫికేట్, ఆదాయ ధృవీకరణ పత్రం వంటి ముఖ్యమైన పత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ పథకం ద్వారా లబ్ధిదారుల ఎంపికలో మహిళలకు 50%, పురుషులకు 50% రిజర్వేషన్లు కేటాయించారు. అలాగే, కులాల వారీగా కూడా ఎస్‌సి, ఎస్‌టి, జనరల్ వర్గాలకు రిజర్వేషన్లు ఉన్నాయి. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు, ఉద్యోగస్తులకు ఎంపికలో ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఈ పథకం ద్వారా కేవలం రవాణా సౌకర్యం మాత్రమే కాకుండా, దివ్యాంగుల విద్య మరియు వృత్తిలో అభివృద్ధికి కూడా ప్రోత్సాహం లభిస్తుంది.
ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగులకు ఉచిత బైకులు
August 17, 2025
0
Tags